జనం న్యూస్ డిసెంబర్ 17 నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్
నాగార్జునసాగర్ బీసీ గురుకుల కళాశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవికుమార్ ద్వారా
తెలుసుకున్న రాష్ట్ర బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు మానవతా హృదయంతో స్పందించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన వైద్య చికిత్స పొందలేకపోతున్న విద్యార్థికి ఆయన తక్షణమే చేయూతనందించారు.విద్యార్థి ఆరోగ్యం ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్న సైదులు, అవసరమైన వైద్య ఖర్చులకు 50, 665 రూపాయల నగదును విద్యార్థి తల్లిదండ్రులకు అందించడంతో పాటు ధైర్యం చెప్పి అండగా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు తమ బాధ్యత అని ప్రిన్సిపాల్ రవి కుమార్ అన్నారు.కార్యదర్శి సైదులు చేసిన సహాయం విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇలాంటి మానవతా చర్యలు విద్యాసంస్థలకు ఆదర్శంగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.


