Listen to this article

జనంన్యూస్. 17.సిరికొండ.

నిజామాబాదు రురల్ సిరికొండ. ప్రజల్ని సమీకరించి ప్రజాపంథా పోరాటాల్లో మమేకం అవ్వాలని సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ పిలుపునిచ్చారు బుధవారం నాడు
న్యూడేమోక్రసి పార్టీకి చెందిన పలువురు మండల నాయకులు ఆపార్టీని విడిచి సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ లో పలువురి చేరారు. న్యూడేమోక్రసికి చెందిన అఖిలభారత రైతుకూలీ సంఘం(AIKMS) సిరికొండ మండల కార్యదర్శి, న్యూడేమోక్రసి గడ్కోల్ గ్రామ కార్యదర్శి పిట్ల చిన్న ఎల్లయ్య తో పాటు మండల నాయకులు రఫిక్, జే రాజులు చేరిన వారిలో ఉన్నారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ: గతంలో మా ఆధ్వర్యంలో జరిగిన భూ పోరాటాల్లో ముఖ్య పాత్ర పోషించిన నాయకులు న్యూ డెమోక్రసీ మోసపూరిత మాటలకు నమ్మి మాకు దూరంగా వెళ్లారని అన్నారు. న్యూడేమోక్రసి పార్టీ వారి మాటలు ఆచరణ చూసి మళ్ళీ మాతృసంస్థకు తిరిగి రావడం హార్శించదగ్గ విషయం అన్నారు. దేశంలో ప్రజల్ని సమీకరించి విప్లవ పోరాటాలను నిర్మించాలని, దానికోసం మనమంతా ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపును ఇచ్చారు.
కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకులు ఆర్. రమేష్, డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, బి కిశోర్, ఎం సాయిరెడ్డి,ఎం అనిస్, మండల నాయకులు ఎం లింబాద్రి, ఎస్ కిశోర్,ఎం నారగౌడ్,జె బాల్ రెడ్డి,జి కిరణ్,జి నర్సయ్య,పిట్ల చిన్న ఎల్లయ్య, జే రాజు, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.