

జనం న్యూస్- ఫిబ్రవరి 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-నాగార్జునసాగర్ హిల్ కాలానికి చెందిన సంయుత్ నాయుడు, ధనుష్ వెంకట్ నాయక్ లు నెట్ బాల్ 38వ నేషనల్ గేమ్స్ (ఇండియన్ ఒలంపిక్స్) కి ఎంపికైనట్లుగా నెట్ బాల్ ఉమ్మడి నల్లగొండ జిల్లా జనరల్ సెక్రెటరీ కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు, గత రెండు వారాలుగా మహబూబ్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన నెట్ బాల్ క్యాంపులో వీరు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి ఇండియన్ ఒలంపిక్స్ కు ఎంపిక అయ్యారని వీరు ఫిబ్రవరి 6 వ తారీకు నుంచి 15వ తారీఖు వరకు ఉత్తరాఖండ్ లో జరిగే నేషనల్ గేమ్స్ (ఇండియన్ ఒలంపిక్స్) లో పాల్గొంటారని తెలిపారు.