Listen to this article

జనం న్యూస్‌ 18 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఏపీఎస్ఆర్టీసీ, ఇప్పుడు సామాన్యుడికి మరింత చేరువయ్యేందుకు సరికొత్త అడుగు వేసింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు కేవలం మొబైల్ ఫోన్‌ ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన మిత్ర’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా వాట్సాప్ ద్వారా సులభంగా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రజా రవాణా అధికారి జి వరలక్ష్మి తెలిపారు.దీనికోసం ప్రయాణీకులు 9552300009 అనే నెంబర్‌ను తమ ఫోన్‌లో సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో ‘హాయ్’ అని సందేశం పంపిస్తే చాలు. వివిధ రకాల సేవలు కనిపిస్తాయి వెంటనే ఆర్టీసీకి సంబంధించిన సేవల జాబితా ఎంచుకుని మీకు కావలసిన రూట్లో టికెట్ను బుక్ చేసుకుని సదుపాయం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. కావున ఈ ఒక్క అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.