జనం న్యూస్ 18 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విశాఖ తీరానికి సమీపంలోని బంగాళాఖాతం సముద్ర జలాల నుంచి ప్రయోగించే క్షిపణి పరీక్షలకు భారత నౌకాదళం నోటిఫికేషనన్ను కేంద్రం మళ్లీ జారీ చేసింది.డిసెంబర్ 22 నుంచి 24 వరకు ఈ పరీక్షలు జరిగే అవకాశం ఉంది. సుమారు 3,240 కిలోమీటర్ల పరిధిని డేంజర్, నో-ఫ్లై జోన్‌గా ప్రకటించింది. భద్రతా చర్యల్లో భాగంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, విమానయాన సంస్థలు ఆంక్షలు పాటించాలని అధికారులు సూచించింది.


