Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 18

జరిగిన స్థానిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన శ్రీనివాస్ రెడ్డి 15 సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఘనవిజయం సాధించారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన శ్రీనివాస్ రెడ్డికి గ్రామ ప్రజలు కులమతాలకు అతీతంగా పూర్తి మద్దతు ఇచ్చారు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు, పారదర్శక పాలన, ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ ఘనవిజయంతో అల్గోల్ గ్రామంలో టిఆర్ఎస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వెల్లివరించగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.