నేషనల్ హెరాల్డ్ కేసులో న్యాయమే గెలిచింది:డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
జనం న్యూస్ 18డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
ఆసిఫాబాద్ :నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులను కోర్టు తప్పు పట్టిన నేపథ్యంలో, బీజేపీ చేసిన అరాచకాలపై కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు.డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తాలో రహదారిపై బైటయించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో నిజం గెలిచిందని, కుట్ర ఓడిపోయిందని, రాజకీయ కక్షతో ఈడీని వాడుకున్న బీజేపీకి ఇది గుణపాఠమని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్దోషులని, ప్రజాస్వామ్యం గెలిచిందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ చేస్తున్న అరాచకాలు ఓడిపోయాయని, ప్రజాస్వామ్య సంస్థల దుర్వినియోగాన్ని ఖండిస్తున్నామని అన్నారు.పదేళ్లుగా గాంధీ కుటుంబాన్ని అవమానించిన బీజేపీ ఈ రోజు దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి.మా నాయకుడు రాహుల్ గాంధీ నిరుద్యోగంపై మాట్లాడితే కేసులు,రైతుల కోసం నిలబడితే ఈడీ,ధరల పెరుగుదలపై ప్రశ్నిస్తే కేసులు.ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా బీజేపీ దేశానికి ఇచ్చే పాలన? ఈ రోజు మేము అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేయడం ఒక్క మా నాయకుల కోసమే కాదు.రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం.ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం.కాంగ్రెస్ పార్టీ భయపడే పార్టీ కాదు..పోరాడే పార్టీ..జవహర్‌లాల్ నెహ్రూ గారి ఆశయాలతో,ఇందిరాగాంధీ గారి ధైర్యంతో,రాజీవ్ గాంధీ గారి త్యాగంతో,రాహుల్ గాంధీ గారి పోరాటంతో మేము ముందుకు సాగుతున్నాం.బీజేపీ ఎంత అణచివేయాలని చూసినా నిజాన్ని ఆపలేరు,న్యాయాన్ని ఆపలేరు,కాంగ్రెస్ పార్టీని ఆపలేరని పేర్కొన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.డీసీసీ కార్యాలయం, కుమురంభీమ్ ఆసిఫాబాద్



