జనం న్యూస్ డిసెంబర్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
కూటమి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ కృషి ఫలితంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం గత ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆశావాదులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ ద్వారా 16,476 పోస్టులు లకు గాను 15,675 మందికి వివిధ కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయ ఉద్యోగస్తులను ప్రభుత్వం నియమించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ ప్రకారం మాట నిలబెట్టుకున్నారని, అదే విధంగా అనకాపల్లి శాసనసభ్యులు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అనకాపల్లి పట్టణంలో మూడు దఫాలుగా నిర్వహించి గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 2000 మందికి మూడు పర్యాయాల ఉద్యోగ నియమికాల్లో సుమారు 60 కంపెనీలతో మాట్లాడి తీసుకువచ్చి నిరుద్యోగ యువతీ యువకులకు భవిష్యత్తు కల్పించారని శ్రీ భోగి లింగేశ్వర దేవస్థానం చైర్మన్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కాండ్రేగుల సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలియజేశారు. కొణతాల రామకృష్ణ శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత నుంచి అనకాపల్లి నియోజకవర్గంలో ప్రణాళిక బద్ధంగా ప్రయారిటీ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలను సర్వ వేగంగా కసింకోట మండలం, అనకాపల్లి మండలం, జీవీఎంసీ ద్వారా సిమెంట్ రోడ్డులు, కాలువలు, ఇరిగేషన్ చానల్స్, కమ్యూనిటీ హాల్, పీహెచ్ఇలు తో పాటు ఎన్టీఆర్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో పేద రోగులకు కావలసిన అన్ని సౌకర్యాలు సిటీ స్కాన్, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సెంటర్, పూర్తిస్థాయిలో డాక్టరు నియామకం చేపట్టి అన్ని విభాగాలకు సంబంధించిన వ్యాధులకు సరియైన డాక్టర్లను నియమించారని, గతంలో కంటే ఓపి రోజు రోజుకి పెరుగుతుందని హాస్పటల్ కు అభివృద్ధి కమిటీ సభ్యులను నియమించి రోగులకు సహాయ సహకారాలు అందిస్తున్నారని, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని డైట్ విషయంలో రాజీ పడకుండా అందిస్తున్నారని, త్వరలో ఎన్టీఆర్ ఏరియా హాస్పిటల్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టబోతున్నారని సత్యనారాయణ అన్నారు.//


