

జనం న్యూస్ //ఫిబ్రవరి 4//జమ్మికుంట //కుమార్ యాదవ్..
దళితబందు రెండో విడత నిధులు మంజూరు కోసం కృషిచేసిన హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు.. అనంతరం రాబోయే రెండో విడత దిశా నిర్దేశల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ.. రెండో విడత దళితబంధు లబ్ధిదారులకు 100% లాభం పొందేలా చేస్తానని అన్నారు.మరియు దళారి వ్యవస్థ లేకుండా ప్రజలను సంతోష పడేలా చేస్తానని ఆయన పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ రాసపల్లి సాగర్ యువజన నాయకులు జిల్లా కార్యదర్శి సలిగంటి సతీష్,శనిగారం తరుణ్ కుమార్,రాచపల్లి రజినికుమార్, రాచపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.