Listen to this article

జుక్కల్ డిసెంబర్ 18 జనం న్యూస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన నూతన సర్పంచ్ లు, వార్డు సభ్యలు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, వార్డు సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.._
శాలువాలతో సన్మానించి అభినందించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన సర్పంచ్ లకు కొన్ని సూచనలు చేశారు..జుక్కల్ నియోజకవర్గ ప్రజలు మనపై విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించారని, పార్టీలను పక్కన పెట్టి, అందరిని కలుపుకొని పోవాలని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి అని సూచించారు..అంతేకాకుండా గ్రామాల్లోని ప్రతి సమస్యను ప్రాధాన్యతగా తీసుకుని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలని ఎమ్మెల్యే చెప్పారు..మీకు అందరికి నేను అండగా ఉంటూ మీ గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని భరోసా ఇచ్చారు..ఇదే సందర్భంగా వివిధ గ్రామాల నుంచి పలువురు నాయకులు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను వీడి, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.. వీరికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..