పయనించే సూర్యుడు డిసెంబర్ 18 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా డిప్యూటీ సీఈవో మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులలో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మరో వంద రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ఉన్నందున పదో తరగతి విద్యార్థులు ఉన్న ప్రతి పాఠశాలకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ విద్యార్థులలో ఉత్తీర్ణశాతం పెంచేందుకు ప్రణాళిక రూపొందించింది. నేడు ఆత్మకూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ రాజ్ జిల్లా డిప్యూటీ సీఈవో మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆత్మకూరు తాహసిల్దార్ పద్మజా, ఎంపీడీవో రఫీ ఖాన్, మండల ఎం ఈ ఓ. కె.చలపతి. మండలంలోని పదవ తరగతి విద్యార్థులు ఉన్న 13 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మరియు 13 పాఠశాలలకు ప్రత్యేకంగా నియమించబడిన 13 మంది ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఈవో మోహన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేలా పదవ తరగతి విద్యార్థులలో చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేలా చర్యలు చేపట్టి ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం కోసమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా వివిధ శాఖలకు చెందిన అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని వీరు తరచూ పాఠశాలను సందర్శిస్తూ విద్యార్థులకు పలు సూచనలు చేస్తారని తెలిపారు. పలువురు హెడ్మాస్టర్లు అడిగిన ప్రశ్నలకు మోహన్ రావు సమాధానం తెలిపారు.


