జనం న్యూస్ డిసెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి వారిని ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గాడిలంకలో మర్యాద పూర్వకముగా కలిసి దుశ్శలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసిన ఉప్పలగుప్తం మాజీ ఎంపీపీ & మాజీ జడ్పీటీసీ పెయ్యిల విష్ణుమూర్తి గారు… ఈ కార్యక్రమంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ, ఎస్టీ ,విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ డైరెక్టర్ వెంట్రు సుధీర్, డాక్టర్ బి. ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా టిడిపి బిసి సెల్ అధికార ప్రతినిధి విత్తనాల వెంకటరమణ, గాడిలంక మాజీ ఉపసర్పంచ్ మామిడిశెట్టి శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



