Listen to this article

, జనం న్యూస్ డిసెంబరు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

నూతనంగా జిల్లా బాధ్యతలు స్వీకరించిన రాజోలు మండలం భారతీయ జనతాపార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీన్ జిల్లా కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. మండల అధ్యక్షురాలు చెల్లింగి వెంకట నాగ లక్ష్మి దుర్గా దేవి అధ్యక్షతన బుధవారం రాజోలు లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాజీ శాసన సభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా పాల్గొని పార్టీలో కష్టపడే వ్యక్తులకు పదవులు దానంతటవే వరిస్తాయని పార్టీ పట్ల విధేయత క్రమశిక్షణ కలిగి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. అనంతరం నీతి అయోగ్ హిందీ సలహాదారు సాదిక్ ను రాష్ట్ర మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి నన్నేసా హుస్సేన్ ను డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ ఓ బి సి మోర్చా అధ్యక్షులుగా నియమితులైన పసుపులేటి మహాలక్ష్మిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చీకరుమల్లి శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు చెల్లింగి త్రినాథ్ వడ్లమూడి ప్రకాష్ దేవల మాణిక్యాలరావు తిక్కా సత్తిబాబు గెద్దాడ ఆదిశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు