జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు..
జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నందు ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సంగాల అయ్యపు రెడ్డి సొసైటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లా గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకు నందు రక్త యూనిట్ల కొరత ఉందని సమాచారం అందడంతో గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకు సహకారంతో అత్యవసర స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని,ప్రాణాపాయ స్థితిలో ఉన్న తోటి వారిని కాపాడడంలో రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారన్నారు.రక్త నేత్ర అవయవ దానాల పై ప్రజలు అపోహలు విడనాడాలని అయ్యపు రెడ్డి పేర్కొన్నారు…ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ ఎం.డి.తాహేర్, డాక్టర్ మోహన్ రావు,కోశాధికారి ధనలక్ష్మి,ఇసి మెంబర్లు అక్బర్ బాషా,రవి,అప్సర్ భాష,పెదొడ్టి నల్లారెడ్డి,లక్ష్మీనారాయణ గౌడ్, సుధాకర్,డాక్టర్ క్రాంతి కుమార్, కరాటే శ్రీహరి, డిటిఎఫ్ ప్రభాకర్, అతికూర్ రెహమాన్,ధరూర్ రవి,మహేష్ నాయుడు,రాకేష్, రాజు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.



