జనం న్యూస్ డిసెంబర్ 19, వికారాబాద్ జిల్లా
పరిగి నియోజకవర్గం పరిగి మండలంలోని మాదారం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన పరిగి మండలం మాదారం గ్రామం బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాములు ను హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పరామర్శించిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి.ఓటమి భయంతో ఎన్ని ఆటంకాలు సృష్టించిన ప్రజలు రాములు వైపు నిలబడి సర్పంచ్ గా గెలిపించడంతో మహేష్ రెడ్డి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.రాములు ని పరామర్శించిన వారిలో మాదారం brs గ్రామ కమిటీ అధ్యక్షుడు మహేందర్, రాందాస్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.


