Listen to this article

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా గుత్తెన దీవి, వేమవరంలో 23/12/ 2025 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మద్దింశెట్టి గంగారావు గారి రైస్ మిల్ వద్ద హిందూ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు చెరుకూరి కృష్ణ రాజం రాజుగారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజ స్వామీజీ శ్రీ రాధా మనోహర్ దాస్ మరియు ఆర్.ఎస్.ఎస్ ప్రాంత కళాశాల విద్యార్థి ప్రముఖ్ శ్రీ బత్తల అశోక్ పాల్గొని మార్గదర్శనం చేస్తారని కావున సమస్త హిందూ బంధువులు ఈ కార్యక్రమములో కుటుంబ సమేతంగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అని తెలిపారు. ఈ కరపత్ర ఆవిష్కరణలో జి.వేమవరం సొసైటీ అధ్యక్షులు పెంట రవి ప్రసాద్, పెన్మత్స కృష్ణంరాజు, అల్లూరి శ్రీను రాజు,రెల్లు గంగాధరం, చోడిశెట్టి రమేష్, గంగాబత్తుల విష్ణు చక్రం ,పడాల ప్రసాద్ , సానబోయిన రాంబాబు, జంధ్యాల విజయలక్ష్మి, నూలు వల్లీ తాయారు,పేరాబత్తుల శ్రీను, గాలి దేవర గంగరాజు, బొంతు కనకారావు ,చిక్కాల బుజ్జి, సలాది శ్రీనివాసరావు, లంకలపల్లి బుజ్జి ,కంతేటి వినయ్, కంతేటి సురేష్, కంతేటి కుమార్, పుట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.