Listen to this article

జనం న్యూస్ | డిసెంబర్ 20 | కొత్తగూడెం నియోజకవర్గం

కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని విజయనగర్ కాలనీలో నివాసముంటున్న కుంకుమ దయానంద్ నాయి బ్రాహ్మణ (క్షవుర వృత్తిదారు) అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఈరోజు ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో మృతి చెందారు. కుటుంబ పోషణ కోసం క్షవుర వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ ఘటన తెలుసుకున్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కురిమల శంకర్ ఆధ్వర్యంలో వారి బృందం మృతుడి నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దయానంద్ కుటుంబ సభ్యులను పరామర్శించి, కష్ట సమయంలో పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కురుమల దుర్గయ్య నాయి బ్రాహ్మణ, జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ, చుంచుపల్లి మండల అధ్యక్షులు కడియాల శ్రీనివాస్, సెక్రటరీ మందల కనకరాజు, కడియాల లాలయ్య, కురిమల రాజు, అన్నదాస్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.