పార్టీలోకి ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
జనం న్యూస్ 19డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
సిర్పూర్ (యు):సిర్పూర్ (యు) మండలం మహాగావ్ గ్రామపంచాయతీ సర్పంచ్ సెడ్మకి జన్నెరావు, ఉపసర్పంచ్ ఆత్రం భీంరావ్, వార్డు సభ్యులు మెస్రం శ్రీరామ్, మడావి సత్తె షీలా, కోట్నాక్ సురేఖ, కుమ్ర అనుసయ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా అల్లిగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీలో చేరిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు కాంగ్రెస్ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం శాలువాలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతనంగా చేరిన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క గ్రామస్తులకు భరోసానిచ్చారు.ఈ కార్యక్రమంలో అల్లిగూడ గ్రామ పటేల్ సెడ్మకి అర్జున్,పటేల్ గూడా గ్రామ పటేల్ కొడప గంగారాం,జైనూర్ మండల పవర్ గూడా సర్పంచ్ తొడసం రాజేందర్,సీనియర్ నాయకులు ఆత్రం గోవిందరావు,ఆత్రం దౌలంత్ రావు, సుద్దాల శ్రీనివాస్, మహేష్,మాజీ సర్పంచ్ వీణ బాయ్, యశ్వంత్ రావు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.డీసీసీ కార్యాలయం, కుమురంభీమ్ ఆసిఫాబాద్



