Listen to this article

ఉప సర్పంచ్ గా మామిడి లక్ష్మి

సర్పంచ్ ఉప సర్పంచ్ కు ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి , బీఆర్ఎస్ పార్టీ నాయకులు
జనం న్యూస్ 19డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా. స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ : రాజంపేట సర్పంచ్ పదవినీ భారత రాష్ట్ర సమితి పార్టీ కైవాసం చేసుకుంది. బుధవారం జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి బుర్సా పోచయ్య గెలుపొందారు. అదేవిధంగా ఉప సర్పంచ్ మామిడి లక్ష్మి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరికి అసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి , బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సరస్వతి, బీ ఆర్ ఎస్ యువ నాయకుడు కోవ సాయినాథ్, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్ బిన్ అబ్దుల్లా , నాయకులు ఆన్సర్ , నిసార్, ఎండీ అహ్మద్, రవి, ఇమ్రాన్, జావిద్, తాజ్ తదితరులు పాల్గొన్నారు.