Listen to this article

డిసిసి అధ్యక్షురాలు ఆధ్వర్యంలో నూతన వార్డు సభ్యుల చేరిక

జైనూర్:జనం న్యూస్, డిసెంబర్ 19. కొమురం భీమ్ జిల్లా.

జిల్లా స్టాఫ్ఫర్:జైనూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ బలం చేకూరింది. శుక్రవారం జైనూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆధ్వర్యంలో ఇటీవల వార్డు సభ్యులుగా గెలుపొందిన షేక్ షఫిక్ అన్సారీ,బుతాలే కిరణ్,షేక్ తజోద్దీన్,అబుజార్,సోహెల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క నూతనంగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శాలువాలతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ కట్టుబడి ఉందని, ప్రజల నమ్మకంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీని మరింత బలోపేతం చేస్తూ గ్రామాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ముఖీద్ అహేమద్,మండల నాయకులు అజ్జులాల, ప్రకాష్,పవర్ గూడా సర్పంచ్ రాజేందర్,దౌలత్,గులాబ్ సాబ్,రమేష్,భుజంగ్ రావు, షేక్ రహీం,షేక్ మజార్, తదితరులు పాల్గొన్నారు.