బొబ్బర్లంక వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న పాకీజా ను పరామర్శించి, ఆర్ధికసాయం చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు..…
తెలుగు సినిమాలలో వెలుగు వెలిగి నేడు దీన స్థితిలో ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామంలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న నటి వాసుకీ (పాకీజా) ఆదుకుంటామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. బొబ్బర్లంక లోని ఆశ్రమానికి ఎమ్మెల్యే సత్యానందరావు వెళ్లి ఆమెను పరామర్శించారు.ఒకప్పుడు 60కి పైగా తెలుగు సినిమాల్లో నటించి, తన కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఈ మహానటి, నేడు వృద్ధాశ్రమంలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశరు అయితే వయస్సు, ఆరోగ్య సమస్యలు,ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రస్తుతం తీవ్ర కష్టాల్లో ఉన్నారన్నారు.ఆమె పరిస్థిటి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు అండగా నిలిచారని ఆమె తెలిపారన్నారు.ప్రస్తుతం నటి వాసూకీ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, బొబ్బరలంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావును కలిసి, ఇక్కడ జీవించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని వినతిపత్రం అందజేశారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వయంగా పాకీజా ఉంటున్న వృద్ధాశ్రమానికి వెళ్లి ఆమెను పరామర్శించి.ఈ సందర్భంగా ఆయన కొంత ఆర్థిక సహాయం అందించి, శాలువాతో సత్కరించారు. అలాగే పాకీజాకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, అవసరమైన సహాయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తామని భరోసా ఇచ్చారు.


