Listen to this article

జనం న్యూస్ 20 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జిల్లాలో రెండు రోజుల పాటు ‘జనం బాట’ కార్యక్రమం పెండింగ్ ప్రాజెక్టుల సందర్శన, రైతులతో ముఖాముఖి
పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి:ఆదివారం షెడ్యూల్: ఉదయం: బీచుపల్లి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనంతో పర్యటన ప్రారంభం. అనంతరం అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన; రోగుల సమస్యలపై సమీక్ష.మధ్యాహ్నం: అలంపూర్ జోగులాంబ దేవి దర్శనం అనంతరం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలోని పెండింగ్ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన.సాయంత్రం: ఐజలో పత్తి రైతులతో భేటీ—పంట దిగుబడి, మద్దతు ధరపై చర్చ. గద్వాల నియోజకవర్గంలోని చేనేత కార్మికులతో ప్రత్యేక సమావేశం.రాత్రి: ధరూర్ మండలం గుద్దేందొడ్డిలో బస.సోమవారం షెడ్యూల్:ఉదయం: నెట్టంపాడు ప్రాజెక్టు సందర్శన, అనంతరం గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పరిశీలన.మధ్యాహ్నం: గద్వాల నియోజకవర్గ రైతులతో ముఖాముఖి కార్యక్రమం.సాయంత్రం: గద్వాల మండలంలోని చేనేత పార్కు సందర్శన; కార్మికుల సాధకబాధకాలపై చర్చ. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం.జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, రైతులు–కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ పర్యటనను చేపట్టినట్లు గొంగళ్ల రంజిత్ కుమార్ తెలిపారు.