Listen to this article

జనం న్యూస్ 20 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

దేశ ప్రజల ఉపాధికి తూట్లు పొడిచి, ప్రజలను దెబ్బ తీయడమే బీజేపీ చెబుతున్న దేశభక్తా అని సీపీఏం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. శ్రీరాం నాయక్ కేంద్రాన్ని ప్రశ్నించారు.శుక్రవారం అలంపూర్ చౌరస్తాలో గ్రామీణ ఉపాధి హామీ పథక రద్దుకు వ్యతిరేకంగా బిల్లు ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ, కేంద్రం తీసుకొస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ 2025 ను పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.గ్రామీణ ఉపాధి హామీ పథకం వామపక్షాల పోరాటంతో సాధించుకున్న చట్టమని, కానీ నేడు ప్రభుత్వం దాన్ని ఒక పథకంగా మార్చే కుట్ర చేస్తున్నదని విమర్శించారు.దేశంలో ప్రజల ఉపాధిని దెబ్బతీయడమే బీజేపీ చెబుతున్న దేశభక్తా అని ప్రశ్నించారు.ప్రజల పని దినాలను,వేతనాన్ని పెంచి,ఉపాధికి గ్యారెంటీ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం, అందుకు భిన్నంగా పేర్లను మార్చి పని దినాల సంఖ్యను తగ్గించి, నిర్వహణ భారాన్ని రాష్ట్రాలపై మోపుతామనడం అన్యాయం అన్నారు. దేశంలో మౌళిక సదుపాయాల కల్పనలో కీలకపాత్ర పోషిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ ముక్తకంఠతో వ్యతిరేకించాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చిన ప్రారంభంలో 100% నిధుల కేంద్రమే భరించాలని నిబంధన ఉండేదని, కానీ నేడు కేంద్ర ప్రభుత్వం 40% రాష్ట్రాలను భరించాలని చెప్పడం అన్యాయం అన్నారు. ఇప్పటికే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయిస్తున్న నిధులలో కోత విధించి కూలీలకు ఉపాధి హామీ పట్ల విరక్తి చెందే విధంగా చేస్తున్నారని, ఇప్పుడు రాష్ట్రాల పైన భారం వేసి పూర్తిగా కేంద్రం తన బాధ్యతల నుండి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.కార్మికులు కర్షకులు ఐక్యమై కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు.ఉపాధి కల్పించడం ప్రభుత్వం బాధ్యత, ప్రజల హక్కని అన్నారు.గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడేందుకు ప్రజలందరూ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సి పి యం జిల్లా కమిటీ సభ్యులు రేపల్లె దేవదాస్, మద్దిలేటి,జి. రాజు,వీవీ నరసింహ, ఉప్పేర్ నరసింహ,మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు నాయకులు వెంకటస్వామి, రఫీ, రవి కుమార్, మహేశ్వరమ్మ,మంచాల నరసింహ, రహీం, అలీ అక్బర్, తదితరులు పాల్గొన్నారు.ధన్యవాదాలతో మద్దిలేటి సి పి యం జిల్లా కమిటీ సభ్యులు జోగులాంబ గద్వాల జిల్లా