Listen to this article

జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య..

జనం న్యూస్ 4 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు మార్చికల్లా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అధికారులను ఆదేశించారు.మంగళవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జంక్షన్ సుందరీకరణ పనులను కుడా వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ విద్యుత్ స్తంభాలను వేరే చోటకు త్వరగా మార్చాలని, మురుగునీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సుందరీకరణ పనుల్లో భాగంగా చేపడుతున్న పనులను త్వరగా పూర్తిచేయాలని అన్నారు. ఆర్టీసీ బస్టాండ్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ త్వరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వెంకటరమణ, ఆర్డీవో రాథోడ్ రమేష్ , ఆర్టీసీ అధికారులు, కూడా అధికారులు పాల్గొన్నారు.సోలార్ ప్లాంట్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్..అనంతరం సూరారం గ్రామంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి భాగ్యలక్ష్మి, సరస్వతి మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ ఈ స్థలం యొక్క స్వభావాన్ని, గ్రూపుల ఆర్థిక పరిస్థితిని గ్రూప్ లీడర్లను మరియు అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీను, రెడ్ కో డీఎం మహేశ్వర్ రెడ్డి ,ఆర్డీవో రాథోడ్ రమేష్ , సెర్ప్ డిపిఎం ప్రకాష్,స్థానిక ఎమ్మార్వో జగత్ సింగ్, ఎంపీడీవో విజయ్ కుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సుకినే సంతాజి, గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్ ,యూత్ మండల అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ ( బక్కి) సీనియర్ నాయకులు పాక రమేష్ ,బొల్లిపోగు డాక్టర్ రమేష్ బాబు, విశాల సహకార సంఘం డైరెక్టర్ ముప్పు మహేందర్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శనిగరపు వెంకటేష్, సంబంధిత అ