(జనం న్యూస్ చంటి డిసెంబర్ 20)
దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో గంగాధర్ సప్న స్వామి సర్పంచ్‌గా విజయం సాధించిన సందర్భంగా గ్రామ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రతి గ్రామస్తుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటానని, గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు. గ్రామ సమస్యలను ప్రజలతో కలిసి చర్చించి పరిష్కరించే విధంగా పాలన సాగిస్తానని పేర్కొన్నారు.యువతను గ్రామాభివృద్ధిలో భాగస్వాములుగా చేసి సూరంపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని సర్పంచ్ గంగాధర్ సప్న స్వామి స్పష్టం చేశారు.యువ సర్పంచ్ విజయం గ్రామానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చిందని గ్రామ పెద్దలు, యువత అభిప్రాయపడ్డారు.


