Listen to this article

జనం న్యూస్‌ 22 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

దృశ్యాలు వైరల్! పార్వతీపురం (జిల్లా) గరుగుబిల్లి (మండలం)కి చెందిన నవ దంపతులు రైలు నుంచి జారిపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. వారిది యాక్సిడెంటల్‌ మృతికాదని, గొడవపడి మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని భావించినా… ఘటనకు కొద్దిసేపటి ముందు రైలులో ఆ జంట గొడవపడిన వీడియో వైరలవుతోంది. క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా? జారిపడి మృతిచెందారా అనేది తెలియాల్సి ఉంది.