జనం న్యూస్ 22 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు భీమిలి నియోజకవర్గం, ఆనందపురం పార్టీ ఆఫీస్‌లో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఆయన కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ఆదివారం ఆనందపురం పార్టీ ఆఫీస్‌లో కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కార్యకర్తలు, నాయకుల సమక్షంలో తన అభిమాన నాయకుడిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు.
ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందుండేవారని పేర్కొన్నారు. విద్యా, వైద్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలు ఎంతో ఎదురుచూస్తున్నారని, త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ పరిధిలోని పార్టీ ఎస్ ఈ సీ మెంబర్లు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, మండల మరియు డివిజన్ పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కార్పొరేటర్లు, జిల్లా మరియు నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సోషల్ మీడియా కార్యకర్తలు, మహిళా ప్రజా ప్రతినిధులు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు మరియు వేలాది మంది ప్రజలు పాల్గొని తమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


