Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 21

మండల కేంద్రమైన తర్లుపాడు గ్రామంలోని స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వైసిపి మండల కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు, ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోపార్టీనాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.కేక్ కటింగ్
వేడుకల్లో భాగంగా నాయకులు ముందుగాదివంగతముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిఘనంగానివాళులర్పించారు. అనంతరం జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగాకేక్ కట్ చేసిఒకరికొకరుమిఠాయిలు తినిపించుకుంటూశుభాకాంక్షలుతెలుపుకున్నారు.ఈ సందర్భంగా వైసిపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందకుండా చేసేలా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, ఇది ప్రజారోగ్యానికి గొడ్డలిపెట్టు అని విమర్శించారు. జగన్ హయాంలో నిర్మించిన ఆరోగ్య మౌలిక సదుపాయాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ పల్లెపోగు వరాలు, వైసిపి సీనియర్ నాయకులు పాలంకయ్య, పల్లెపోగు ప్రభాకర్, వన్నెబోయిన అంజి, షేక్ రెహ్మాన్, మందటి మల్లిఖార్జున రెడ్డి, మెట్టు వెంకటరెడ్డి,గన్నేపల్లి బ్రాహ్మయ్య గాలి గుండయ్య పార్టీకార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.