జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 22
శ్రీ రుక్మిణి సత్య భామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం లో ఈ నాటి 7 వ రోజు ధనురుమాస పూజ
దేవస్థానం వంశ పారంపర్య ధర్మ కర్త జవ్వాజి విజయ భాస్కరరావు ఆధ్వర్యంలో శ్రీ మాన్ కారంపూడి సాయిమోహనాచార్యులు విశేష అభిషేకం లు, శాస్త్రోక్త పూజలు తో వైభవముగా జరిగింది. ఈ నాటి పూజ ఉభయ దాతలు కీ/శే. కొత్తూరి జనార్ధన శెట్టి జ్ఞాపకార్ధము ధర్మ పత్ని సుబ్బలక్షమ్మ, వీరి కుమారులు 1.రవికుమార్ 2.చంద్ర శేఖర్ 3.శ్రీధర్ మరియు కుటుంబ సభ్యుల చే వైభవం గా జరుపబడింది. ఈ కార్యక్రమం లో జవ్వాజి సంధ్య, భావన, సుబ్రహ్మణ్యం, సౌజన్య, కృష్ణ వేణి, సుజాత, బుర్రి లక్ష్మీ, ఇన్నమూరి సుబ్బులు, గోసు అరుణ, మంచికంటి లక్ష్మి, లింగమ్మ, గాలేమ్మ, భవనము రామకృష్ణారెడ్డి నగర సంకీర్తన బృందము, మాదాల రాజ్య లక్ష్మీ ఇంకా అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు పాసుర పఠనములో గోదా దేవి అండాల మాత శ్రీ మహా విష్ణువు శ్రీ కృష్ణ భగవానుడు దర్శనము, కైంకర్య ములు చేయుటకు అందరూ భౌతిక సుఖ లాలస వీడి సీతలము చలికి ఓర్చుకొని శ్రీ కృష్ణుని సేవించి తరించాలని మనకు సూచించారు. జై శ్రీ మన్నారాయణ.


