Listen to this article

జనం న్యూస్ 22 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

సరిత తిరుపతయ్య ఆదేశాలనుసారం జాతిపిత మహాత్మా గాంధీజీపై బిజెపి చేస్తున్నా కుట్రలు సిగ్గు చేటు

మాచర్లలక్ష్మణ్. యూత్ కాంగ్రెస్ అసెంబ్లి వైస్ ప్రెసిడెంట్ గద్వాల. భారత స్వాతంత్ర్య పోరాటంలో తన ప్రాణాలను సైతం అర్పించిన జాతిపిత మహాత్మా గాంధీజీ పేరు, వారసత్వం మరియు సిద్ధాంతాలను ఉద్దేశపూర్వకంగా చెరిపివేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు కేంద్ర ప్రభుత్వ చర్యలను గద్వాల యూత్ కాంగ్రెస్ తరపున తీవ్రంగా ఖండిస్తూన్నాం సత్యం, అహింస, సామూహిక ఉద్యమాల మార్గంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని నడిపించిన మహాత్మా గాంధీజీ సేవలు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి భారతీయుడికీ తెలిసినవే. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ పాత్ర విడదీయలేనిది, మరువలేనిది. ఆయన త్యాగాలు, నాయకత్వం, నైతిక ధైర్యం దేశాన్ని ఏకం చేసి కోట్లాది మందిని వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడేలా ప్రేరేపించాయి ఉంటాయని అన్నారు గాంధీజీ పేరును తగ్గించడానికి, వక్రీకరించడానికి లేదా చెరిపివేయడానికి చేసే ఏ ప్రయత్నమైనా ఆయనకే కాకుండా స్వాతంత్ర్య పోరాటానికి, దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన అనేక మంది దేశభక్తులకు అవమానమే కదా అని మాట్లాడారు ఇలాంటి బాధ్యతారహితమైన మరియు విభజనాత్మక ప్రయత్నాలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మహాత్మా గాంధీజీ నిజమైన చరిత్రను, భారత స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన అపూర్వ త్యాగాలను ముందుగా అర్థం చేసుకుని గౌరవించాలని యూత్ కాంగ్రెస్ తరపున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము అని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు బ్రిటిష్ పాలన కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పోషించిన చారిత్రక పాత్ర గురించి దేశ ప్రజలకు బాగా తెలుసు; అది గాంధీజీ వలస పాలనకు వ్యతిరేకంగా సాగించిన జీవిత పోరాటానికి పూర్తి విరుద్ధంగా నిలుస్తుంది అని అన్నారు చరిత్రను వక్రీకరించడం గానీ, మహాత్మా గాంధీజీ పట్ల అవమానం చూపించడం గానీ భారతదేశం సహించదు. ఆయన సిద్ధాంతాలు నేటికీ దేశానికి దారి చూపుతున్నాయి, భవిష్యత్తుకూ మార్గదర్శకంగానే ఉంటాయి అని కొనియాడారు