జనం న్యూస్ డిసెంబర్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
తెలుగుదేశం వీరాభిమాని రైతు బిడ్డ ఆళ్ల ఆదినారాయణ వయస్సు 81 ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు అందరికీ వివాహం చేసి వ్యవసాయాన్ని నమ్ముకుని భూమి పైనే ఆధారపడి కుటుంబాన్ని పిల్లలను ప్రయోజకులను చేసిన ఆదినారాయణ లేకపోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఒక రైతు బిడ్డని కోల్పోయామని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శ్రీ పరమేశ్వరి పార్టీ జంక్షన్ లో అతను చిత్రపటానికి మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు పొలిమేర నాయుడు కోరుకొండ అప్పారావు కాండ్రేగుల రమేష్ వేగి నాయుడు బుద్ధ శ్రీనివాసరావు దొడ్డి లక్ష్మణరావు ఆడారి శ్రీను నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.


