జనం న్యూస్ డిసెంబర్ 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
తిమ్మరాజుపేట గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో గవర కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు పాల్గొని పిల్లలు కు దగ్గరుండి పోలియో చుక్కలు వేయించారు. అయన మాట్లాడుతూ కేవలం మందు కాదు పిల్లల భవిష్యత్తుకు భద్రత,ఆరోగ్యానికి భరోసా అప్పుడే పుట్టిన శిశువు నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలను తప్పుగా వేయించాలని పోలియో రహిత భారత మన లక్ష్యం మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంనకు కుటుంబ ఆరోగ్యశాఖ వారితోపాటు ప్రజలు,పిల్లలు పాల్గొన్నారు.//


