Listen to this article

జరం న్యూస్ డిసెంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ఈరోజు ఆదిలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబురావు మహంతి, యోగా గురువు ద్వారా యోగా, ధ్యానం మరియు నవ్వు ప్రక్రియలు టిఓఎస్ అనిభిసెంట్ బలవాడి తెలుగు, ఒడియా మాధ్యమాల్లో నిర్వహిస్తున్న విద్యాలయం లో కస్తూరి నగర్ 1వ లైన్ లో యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యోగా, ప్రాణాయామం లతో ఆరోగ్యంగా ఆనందంగా కలకాలం ధైర్యంగా జీవించవచ్చని అందుకు ప్రతిఒక్కరు తమ దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా చేసుకొని సుఖవంతమైన జీవనయాపన చేస్తూ భావి భారత పౌరులుగా ఎదిగాలని పిలుపునిచ్చారు.ముందుగా విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీమతి సత్యవతి డాక్టర్ బాబూరావు గారి బేనర్ ను ప్రారంభించి యోగా నిర్వహించ వలసిందిగా ఆహ్వానించారు. విద్యార్థీ విద్యార్థినులు శ్రధ్ధగా పాల్గొని ఆనందించారు. పిమ్మట డాక్టర్ బాబూరావు పిల్లలకు బిస్కెట్లు మరియు చలికాలం కారణంగా విక్స్ బిల్లలు పంచిపెట్టారు.ఇక నుండి ఇచ్చట క్రమం తప్పకుండా యోగా తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. శ్రీమతి సత్యవతిగారి ధన్యవాదములతో కార్యక్రమం ముగిసింది.