Listen to this article

*ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్
మంచిర్యాల జిల్లా అధ్యక్షులు
నక్క రాజన్న

జనం న్యూస్ 4(భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామపంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటస్వామి పై పెట్టిన అక్రమ కేసు వెనకకు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు బహిష్కరించి ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఫీల్డ్ అసిస్టెంట్ ఐ ఎన్ టి యు సి యూనియన్
జిల్లా అధ్యక్షులు.
నక్క రాజన్న
గౌరవ అధ్యక్షులు
ఈద లింగయ్య జిల్లా ఉపాధ్యక్షులు. సతీష్. శంకర్. శ్రీనివాస్ సుదర్శన్ గౌడ్
ప్రధాన కార్యదర్శి భూమ
ప్రచార కార్యదర్శి సతీష్ కోశాధికారి వేణు
ముఖ్య సలహాదారులు
రజిని
స్వామి
మండల ఆధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు. జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ డిమాండ్ చేయడం జరిగింది సిద్దిపేట జిల్లా గోవర్ధనగిరి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటస్వామి పని ప్రదేశం కు వెళ్లి కూలీల హాజరు నమోదు చేసుకొని కూలీలకు తగు జాగ్రత్తలు చెప్పి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ కు రెండు గ్రామపంచాయతీలు ఉండడం వలన మరొక గ్రామ పంచాయతీకి హాజరు తీసుకోవడానికి వెళ్లడం జరిగింది. అదే క్రమంలో అక్కడ మట్టి పనులు చేస్తున్న కూలీలు త్రవ్వడానికి గట్టిగా వస్తుంది అని నీలు పోసి పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బండారాలు మీద పడి తల్లి కూతుర్లు మరణించడం జరిగింది ఫీల్డ్ అసిస్టెంట్ అక్కడ ఉన్న కూలీలకు బండ రాళ్లు మీద పడుతాయి అక్కడ పనులు చేయకండి అని చెప్పిన గాని ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నంతసేపు అక్కడ చేయకుండా ఉండి ఫీల్డ్ అసిస్టెంట్ మరొక గ్రామ పంచాయతీకి వెళ్లిన తర్వాత అక్కడ పని చేయడం వలన ప్రమాదవశాత్తు తల్లి కూతుర్లు బండారాలు మీద పడి మరణించడం జరిగింది దానికి ఫీల్డ్ అసిస్టెంట్ కారణమని కేసు నమోదు చేయడం అన్యాయమని గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చిన కార్యదర్శిని వర్క్ ఎస్టిమేషన్ వేసిన అధికారులను సాంక్షన్ ఇచ్చిన అధికారులను ప్రక్కన పెట్టి ఫీల్డ్ అసిస్టెంట్ పై కేసు నమోదు చేయడం కరెక్ట్ కాదు ఫీల్డ్ అసిస్టెంట్ ఒక గ్రామ పంచాయతీకి ఒక్కరే ఉండాలి కానీ కొన్ని చోట్ల ఒక ఫీల్డ్ అసిస్టెంట్ మూడు నాలుగు గ్రామ పంచాయతీలకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది మరి అలాంటి అప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ పై ఏ విధంగా కేసు పెడతారు అని ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ సంఘాలు ఖండించడం జరుగుతుంది
చనిపోయిన తల్లి కూతుర్ల కుటుంబానికి తక్షణమే గవర్నమెంట్ ఆదుకొని గవర్నమెంట్ నుండి వచ్చే ఇన్సూరెన్స్ కాకుండా మరికొంత హార్దిక సాయం చేసి ఆదుకోవాలి అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ పై పెట్టిన కేసు వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.