జనం న్యూస్ డిసెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జి.వేమవరం సిద్ధార్థ నగర్ లో ఉన్న రామాలయానికి మరియు గుత్తెనదీవి రాఘవేంద్రపురంలో ఉన్న రామాలయానికి హిందూ ధర్మ రక్షా సమితి చే రెండు మైక్ సెట్ లు బహుకరించినట్లు ఆర్ఎస్ఎస్ పర్యావరణ ప్రముఖ్ శ్రీ రెల్లు గంగాధరం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుత్తెనదీవి ఉపమండలంలో మద్దింశెట్టి గంగారావు గారి రైస్ మిల్ ప్రాంగణంలో 23వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు ఈ కార్యక్రమంలో శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ పాల్గొంటారని తెలిపారు .ఈ కార్యక్రమంలో రెల్లు గంగాధరం,పడాల ప్రసాద్ మద్దింశెట్టి శ్రీను, పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు,బొంతు కనకారావు, పెన్మత్స గోపాలకృష్ణం రాజుగారు, అల్లూరి శ్రీను రాజుగారు, సలాది శ్రీనివాసరావు, పండు చంద్రర్రావు, యంటపల్లి నాగేశ్వరరావు, ములపర్తి నాగేశ్వరరావు, వడ్డి చిన్న,రాయపు రెడ్డి బుజ్జి, చోడిశెట్టి రమేష్, రేవు దొరబాబు, రేవు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



