జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
చిన్నారుల నిండు జీవితానికి రెండు పల్స్ పోలియో చుక్కలు చాలని నందలూరు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్య నారాయణ మండల ప్రభుత్వ వైద్యాధికారి శరత్ కుమార్ కమ్యూనిటీ హెల్త్ అధికారి వెంకటనారాయణ లు అన్నారు. నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సచివాలయం 1 లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకు చుక్కలు వేశారు. అలాగే నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆరవపల్లి క్రీడామైదానంలోని ప్రాథమిక పాఠశాల గొల్లపల్లిలోని అంగన్వాడి కేంద్రం నాగిరెడ్డిపల్లి లోని ప్రాథమిక పాఠశాల రైల్వే ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన పోలియో కేంద్రాలను పరిశీలించి చిన్నారులకు చుక్కలు వేశారు. ఉదయం నుండే పెద్ద ఎత్తున తల్లి దండ్రులు పోలియో కేంద్రాలకు చిన్నారులను తీసుకువచ్చి చుక్కలు వేయించుకోవడం జరిగింది.ఈకార్యక్రమంలోఏ.ఎన్.ఎం.లు ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


