Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలోని గండ్రవాణి గూడెం గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి సురేష్ రావు,ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థి బొబ్బలి కావ్య శ్రీనివాస్ యాదవ్,ఉప సర్పంచ్ కొణతం కళావతి సత్యనారాయణ రెడ్డి వార్డ్ సభ్యులను అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బొబ్బలి కావ్య శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నన్ను ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అమలు చేసే దిశగా కృషి చేస్తానని అన్నారు. ఎటువంటి భేద భావాలు చూపకుండా అందరితో మమేకమై గ్రామ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు.గ్రామంలో ఎటువంటి సమస్యలు నెలకొన్న తమ దృష్టికి తీసుకు వచ్చినట్లయితే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని అన్నారు.అనంతరం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.