

జమ్మికుంట గుమస్తాలా సంఘం ఆర్ధిక సహాయం..
జనం న్యూస్ //జనవరి 11//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బండి వెంకటేష్ అనే గుమస్తా గత నెల మూడో తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు.కాగా జమ్మికుంట పట్టణంలో గుమస్తాగా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ అనారోగ్యంతో మృతిచెందగా గుమస్తాల సంఘం అధ్యక్షులు పోశాల వెంకన్న ఆధ్వర్యంలో గుమస్తాలు అందరూ కలిసి అత్తిదారుల సహాయంతో 53000 కలెక్ట్ చేసి వాటి రూపాయలను మృతుడి కూతురైన అన్విత శ్రీ పేరుమీద సుకన్య యోజన పథకంలో పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డిపాజిట్ చేశారు. తనతో పని చేసిన గుమస్తాకు అండగా తాము ఉన్నామని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి ఆర్థిక చేయూతని అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమానికి కమిటీ సభ్యులు మరియు అర్ధిదారులు పాల్గొన్నారు.