Listen to this article

జనం న్యూస్ // ఫిబ్రవరి 4//జమ్మికుంట //కుమార్ యాదవ్..

జమ్మికుంట మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామానికి చెందిన, ఉన్నత విద్యావంతుడు, (ఎంఎస్సీ బీఈడీ ) బోయిని సదానందం, ఎమ్మార్పీఎస్ జమ్మికుంట మండల అధ్యక్షునిగా నియమించారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, నూతన నిర్మాణంలో భాగంగా, వేయి గొంతులు లక్ష డప్పుల జిల్లా పర్యటనలో, జమ్మికుంట మండల సమావేశంలో, సదానందం ను మండల అధ్యక్షునిగా ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, బెజ్జంకి అనిల్ ,ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేయి గొంతులు లక్ష డబ్బులు మహా కళ ప్రదర్శన నిర్మాణ కమిటీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ రామంచ భరత్ మాదిగ,హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ శిరీష ప్రవీణ్ మాదిగ,వేయి గొంతులు లక్ష డబ్బులు కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ అంబాల ప్రభాకర్ మాదిగ,కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్ మాదిగ, ఎర్ర ఆదిత్య మాదిగ జమ్మికుంట, మండల ప్రధాన కార్యదర్శి ఆసాల సారయ్య మాదిగ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎమ్మార్పీఎస్ పాల్గొన్నారు