Listen to this article

జనం న్యూస్ ; డిసెంబర్ 22 సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ వై. రమేష్ ;

సిద్దిపేట పట్టణంలోని బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ గణిత కార్యకలాపాలు, నమూనాలు, ప్రదర్శనల ద్వారా తమ నైపుణ్యాలను ప్రదర్శించి తల్లిదండ్రులను ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ మాట్లాడుతూ, గణితం మన నిత్యజీవితంతో విడదీయరాని సంబంధం కలిగి ఉందని, గణితం అన్ని శాస్త్రాలకు తల్లి వంటిదని వివరించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.అదేవిధంగా పాఠశాల డైరెక్టర్ మల్లిక విద్యార్థులు కనబరిచిన ప్రతిభకు ఆనందం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ పోటీల్లో మొదటి బహుమతి – ఏడవ తరగతి విద్యార్థిని ఎం. చరిత, ద్వితీయ బహుమతి – ఆరో తరగతి విద్యార్థిని తనుశ్రీ తృతీయ బహుమతి – ఐదవ తరగతి విద్యార్థులు అంజుమ్ మరియు శ్రేష్ట విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.