బిచ్కుంద డిసెంబర్ 22 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ఆర్యభట్ట స్కూల్లో శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్. అశోక్ రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కె .అశోక్ మాట్లాడుతూ, శ్రీనివాస రామానుజన్ తన జీవితాన్ని గణిత శాస్త్ర అభివృద్ధికి అంకితం చేసి ఎన్నో క్లిష్టమైన గణిత సూత్రాలను కనుగొని విశ్వానికి అందించిన అపూర్వ మేధావి అని కొనియాడారు. భారతదేశ గణిత శాస్త్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు, కృషి నేటి తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోలేవర్ పరమేష్ మాట్లాడుతూ, శ్రీనివాస రామానుజన్ గణితశాస్త్రం ద్వారా భారతదేశ ప్రతిభను ప్రపంచానికి చాటిన కృషీవలుడని అన్నారు. గణిత శాస్త్ర విభాగాధిపతి పి. జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులు గణితాన్ని కేవలం ఒక పాఠ్యాంశంగా కాకుండా ఒక పద్ధతిగా, ఒక నైపుణ్యంగా భావించి సులభంగా అర్థం చేసుకుని ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. గణితంపై భయాన్ని తొలగించి ఆసక్తితో నేర్చుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు




