

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 4 రిపోర్టర్ సలికినిడి నాగరాజు వెలుగు యానిమేటర్లు సంఘం మరియు సిఐటియు రాష్ట్ర జిల్లాల అధ్యక్షులు ఈరోజు సెర్ప్ సీఈఓ కలిసి వారి యొక్క బాధలు విన్నవించుకున్నారు ఉద్యోగ భద్రత కల్పించాలి కాలపరిమితిని వెంటనే రద్దు పరచాలి తొలగించిన వారి వెంటనే వీధిలోకి తీసుకొని కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని తెలియజేశారు వివో ఎ లా సొంత ఖాతాలోకి వేతనాన్ని జమ చేయాలి గౌరవ వేతనం పెంచి మా కష్టాల నుండి బయట పడేయాలని వేడుకొన్నారు గౌరవ వేతనం కనీసం 28 వేల రూపాయలైనా చేసి హెచ్ఆర్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఇప్పుడైనా మాపై దృష్టి సారించి వివోఏల యానిమేటర్లు ఆదుకోవాలని రాష్ట్ర అధ్యక్షురాలు ధనలక్ష్మి పల్నాడు జిల్లా అధ్యక్షురాలు ఎన్ ఏసుమ్మ రాష్ట్ర సిఐటియు నాయకులు మరియు యానిమేటర్లు పలు జిల్లాల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు