

రెగ్యులర్ అధికారులు లేక పర్యవేక్షణ కరువు,
విద్యార్థుల వార్షిక పరీక్షలకు ఇక ఇక్కట్లే.
రెగ్యులర్ అధికారులను నియమించకుంటే ఆందోళన షురూ.
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ డిమాండ్
జనం న్యూస్ పిబ్రవరి 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అంటేనే ఇన్ చార్జి లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది, పేరుకే కొమురం భీం జిల్లా కానీ జిల్లా లో కలెక్టర్ మొదలుకొన్ని కింది స్థాయి అధికారుల వరకు ఇన్చార్జిల తోటే కొనసాగుతుంది, గతంలో ఈ జిల్లాకి కలెక్టర్ ను కూడా ఇన్చార్జిగా ఇచ్చింది ప్రభుత్వం అంతటి దుస్థితికి చేరుకుంది జిల్లా విద్య వ్యవస్థ గాడిలో ఉండాలంటే జిల్లా విద్యా శాఖ అధికారి అవసరం విద్య వ్యవస్థ ముందుకు పోతుంది, దాన్ని నడిపించాలంటే విద్యాశాఖ అధికారి ఉండాలి, కానీ ఈ జిల్లాకి ప్రభుత్వం విద్యాశాఖ అధికారిని నియమించడంలో పూర్తిగా విఫలమైంది, పక్క జిల్లా నుంచి అరదు తీసుకొని ఇన్చార్జిలుగా ఇచ్చే దుస్థితికి జిల్లా విద్యా వ్యవస్థని తీసుకొ వచ్చింది ప్రభుత్వం, మొన్నటి వరకు మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి ఇన్చార్జిగా ఉన్నాడు తను సెలవులపై వెళ్లడంతో అక్కడే ఏడిగా విధులు నిర్వహిస్తున్న అధికారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు తను ఈ నెల చివరి వరకు పదవి విరమణ పొందుతారు, అప్పుడు మళ్ళీ జిల్లా కి విద్యాశాఖ అధికారి కరువు అవడమే తప్ప వేరే మార్గం లేదు, అసలే వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్న వేల విద్యాశాఖ అధికారి లేకపోవడం చాలా సిగ్గుచేటు అయిన విషయం దీనికి తోడు మండల విద్యాశాఖ అధికారులు కూడా ఇన్చార్జులు గానే కొనసాగుతున్నారు, ప్రధానోపాధ్యాయులకు ఇన్చార్జులు ఇవ్వడం పూర్తిగా పర్యవేక్షణ లోపిస్తుంది, విద్య వ్యవస్థ కుంటుపడిపోతుంది, ఇంత జరుగుతున్నా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ జిల్లా కలెక్టర్ గాని కూసంత కూడా స్పందించకపోవడం బాధాకరం జిల్లా ఇన్చార్జి మంత్రి కూడా ఈ విషయంపై ఎప్పుడు కూడా చర్చ చేయలేదు, ఈ జిల్లా మీద ఎందుకు వివక్ష చూపెడుతున్నారు, విద్యాశాఖల నే కాదు ఇంకా మైనార్టీ జిల్లా అధికారి, క్రీడా జిల్లా అధికారి, ఇన్చార్జి బాధ్యతలు గిరిజన శాఖ అధికారి కి ఇవ్వడంతో అక్కడ కూడా అనేక సమస్యలు వస్తున్నాయి, అదే కాకుండా జిల్లా ఉపకార అధికారి కూడా ఇన్చార్జి గానే ఉన్నారు, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి కూడా ఇన్చార్జి ఇలా ఒక అధికారికి రెండు మూడు బాధితులు ఇవ్వడంతో పర్యవేక్షణ పూర్తిగా లోపిస్తుంది అవ్వాల్సిన పనులు కావడం లేదు, ఇక ఇన్చార్జిల పాలన ఇలానే కొనసాగితే భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నము, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు టెంటు వేసి నిరాహార దీక్షలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము, జిల్లా కలెక్టర్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తక్షణమే స్పందించి ఈ జిల్లాలో ఉన్న ఇన్చార్జిల వ్యవస్థని రెగ్యులర్ వ్యవస్థలుగా మార్చాలని రెగ్యులర్ అధికారులని నియమించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గెడం టికనంద్, టిఎజిఎస్ జిల్లా అధ్యక్షులు కొరెంగ మాలశ్రీ తదితరులు పాల్గొన్నారు