జనం న్యూస్ 23 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
రోడ్డు భద్రత, ప్రజల రక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు విజయనగరం పట్టణంలోని పెద్ద చెరువు రోడ్డులో రేడియం స్టిక్కర్లతో కూడిన టైర్లను సోమవారం ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను విజయనగరం 1వ పట్టణ సీఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ట్రాఫిక్ సీఐ సి.హెచ్.సూరి నాయుడు పర్య వేక్షించారు. వేగ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


