జనం న్యూస్ డిసెంబర్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం బాలాజీనగర్ వాసి శ్రవణ్ మట్ట కుమార్తె షాన్విక శ్రీ అత్యంత అద్భుతమైన నాట్య ప్రదర్శనను అందించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె ప్రదర్శించిన నాట్యానికి హాజరైన వారందరూ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా, చిన్న వయసు నుంచే కూచిపూడి నాట్యాన్ని అభ్యసిస్తూ ప్రదర్శనలు ఇస్తున్న షాన్విక శ్రీ ప్రతిభను గమనించిన ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బిర్లా ఐలయ్య హర్షం వ్యక్తం చేశారు. ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు తెలిపారు.



