Listen to this article

జనం న్యూస్ 23 డిసెంబర్ వికారాబాద్ జిల్లా

పూడూరు మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన సర్పంచ్ గ్రామాభివృద్ధే లక్ష్యంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ నెంబర్లు స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం శాలువాలు పూల దండలతో సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ బొల్లి పద్మ – రాజు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని పంచాయతీకి వచ్చిన నిధులు వృధా చేయమని అలాగే గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.