కొత్తగూడెం నియోజకవర్గం, డిసెంబర్ 23 (జనం న్యూస్):
బాబు క్యాంప్ గ్రామపంచాయతీ పరిధిలో గబ్బిలాల కారణంగా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీలోని నాలుగో, ఏడో, 11వ వార్డులకు చెందిన వార్డు సభ్యులు నావత్ మేక్యా, తవుటం మురళీకృష్ణ, జోగా విశ్వేశ్వరరావు, ఎండి పాషా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇళ్ల పక్కన గబ్బిలాలు ఎక్కువగా ఆశ్రయిస్తున్న చెట్లను తొలగిస్తూ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరమని వారు తెలిపారు.
గ్రామంలో పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఇలాంటి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని వార్డు సభ్యులు కోరారు. ఈ శ్రమదాన కార్యక్రమం గ్రామస్తుల నుంచి ప్రశంసలు అందుకుంది.


