Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 23 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన గంధం పల్లంరాజు మురమళ్ళలోని కార్యాలయంలో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు వారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అలాగే రాబోయే కార్యక్రమాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కార్యకర్తలను సమన్వయంతో ముందుకు నడిపిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు నిర్ణయించారు.అనంతరం పరస్పర అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కలిసి పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.చిక్కాల గణేష్, మోకా సుబ్బారావు, గొల్ల కోటి దొరబాబు, తాడి నరసింహారావు, మురమళ్ళ వీరేశ్వర స్వామి దేవస్థానం డైరెక్ట్ నాగభూషణం విలేకర్ రాజు తదితరులు