Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 డిసెంబర్

పురుగుల మందుల వాడకంలో రైతులు తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది !

పురుగుల మందులు ఉపయోగించే ముందు డబ్బాపై ఉండే లేబుల్‌ను,వివరాల పత్రాలను తప్పకుండా చదవాలి. పురుగులు మందు పిచికారి చేసే సమయంలో ముఖానికి మాస్కు ధరి౦చాలి. పురుగుల మ౦దు డబ్బా మూతను నోటితో తీయకూడదు. పురుగుల మందు డబ్బా లేదా ప్యాకెట్‌ వాడే ముందు సీల్ చిరిగి ఉన్నట్లయితే ఆ మందును వాడకూడదు. పిచికారి సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!పంట పొలాల్లో పురుగుల మందులను పిచికారి చేయడం లేదా వాడే ముందు రైతులు చేతులకు రబ్బరు తొడుగులను కచ్చితంగా ధరించాలి. ముఖం మొత్తం కవర్ అయ్యే విధంగా మాస్క్ ధరించాలి.తలకు టోపి పెట్టుకోవాలి. శరీరం మొత్తం కప్పిఉంచేలా దుస్తులు ధరించడం మంచిది మరియు కాళ్లకు బూట్లు వేసుకోవాలి. పురుగుల మందులు కలపడంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పురుగుల మందుకు సరైన మోతాదులో నీరు కలపాలి.పురుగుల మందులను చేతులతో కలపడం మంచిది కాదు. గాలి వీచే దిశలో పురుగుల మందును పిచికారి చేయాల్సి ఉంటుంది.పురుగుల మందుల వాడిన తర్వాత డబ్బాలను పగలగొట్టి భూమిలో పాతిపెట్టాలి. పురుగుల మందులు చల్లిన వ్యక్తి చల్లడం పూర్తయిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. పరిసరాలు కలుషితం కాకుండా, మంచు చల్లిన పొలాల్లో హెచ్చరిక బోర్డును ఉంచడం మంచిది. ఈ మీటింగ్ లో పట్వారి కృష్ణ,జెలీల్ హమద్ ex- కో ఆప్షన్ సభ్యులు ,తాధితరులు మరియు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ TM సతీష్ , AGM రమేష్ బాబు సార్, AM దుర్గా భవాని మేడం, పిటి మహేష్ , పిటి నాగేష్ ఆందోల్ నర్సింలు పాల్గోనడం జరిగింది .రైతులకు సేఫ్టీ కిట్లు పంచడం జరిగింది.