Listen to this article

జనం న్యూస్ 23 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసి మళ్ళీ జాగృతి పేరుతో కొత్త డ్రామా తెర లేపావ్..డీకే అరుణమ్మ నీ విమర్శించే స్థాయి మీది కాదు లిక్కర్ రాణి కవిత..పాదయాత్రతో మీ అయ్యా (కెసిఆర్ )మెడలు వంచి జిల్లా సాధించింది..లిక్కర్ స్కామ్ లో కోట్లు దోచుకొని మహిళలకు మాయని మచ్చగా మారావ్…తన రాజకీయ జీవితంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన డీకే అరుణమ్మ ని విమర్శించే హక్కు నీకు లేదు..గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసింది..ఈ రోజు గద్వాల పట్టణంలోని డికె. బంగ్లా లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాజీ మున్సిపల్ చైర్మన్ టి కృష్ణవేణి మాట్లాడుతూ..తుమ్మిళ్ల ప్రాజెక్టు కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని మీ అయ్యా కేసీఆర్ పూర్తి చేయలేదు..కానీ మా నాయకురాలు నెట్టెంపాడు ప్రాజెక్టుతో రెండు లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత డీకే అరుణమ్మ ది
డికె.అరుణమ్మ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప గత ప్రభుత్వం ,ప్రస్తుత ప్రభుత్వం ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు.. పైగా రోడ్లు కంకర తేలింది రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి అంటున్నారు..మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బండల పద్మావతి మాట్లాడుతూ..అక్రమ ఇసుక దందా కేరాఫ్ అడ్రస్ గా కల్వకుంట్ల కుటుంబం , ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేర్లతో అక్రమ ఇసుక దందా చేస్తున్నారు..గద్వాలకు ఐటిఐ కాలేజీ , పాలిటెక్నిక్ కాలేజీ,మండలానికి జూనియర్ కాలేజీలను,మహిలడిగ్రీ కాలేజీ, కస్తూర్బా పాఠశాల ప్రారంభించిన ఘనత డికె. అరుణమ్మ ది..టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క బిల్డింగ్ లు కట్టింది లేదు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల భవనాలకు అద్దె కట్టలేని పరిస్థితి , విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో ప్రాణాలు వదులుతున్నారు , ఫీజు రివెంబర్మెంట్ ఇవ్వడం లేదని అని అన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు సమత గౌడ్, మహిళ మోర్చా నాయకురాలు . భారతి, శ్యామల భారతి తదితరులు ఉన్నారు.